English   

దొంగగా మారిన కార్తి

karthi
2019-11-16 08:03:38

వదినా మరుదులు జోతిక, కార్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ సినిమా ‘తంబి’. ఖైదీ సినిమాతో హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న కార్తీ ఆదే ఊపుని కంటిన్యూ చేయడానికి ఈ సినిమా రిలీజ్ తో రెడీ అయిపోయాడు. అయితే ఈ సినిమాకి తమిళ్ లో తంబి అని పేరు ఉండడంతో తెలుగులో ‘తమ్ముడు’ అనే పేరుని పెడతారని ఫిక్స్ అయిపోయారు చాలామంది. అందుకే కార్తీ మెగాస్టార్ టైటిల్స్ మీద పడ్డాడు ఏంట్రా బాబూ అన్నట్టు సోషల్ మీడియా చర్చలు కూడా జరిపారు. కానీ అనూహ్యంగా ఈ సినిమాకి ‘దొంగ’ అనే పేరును ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు దర్శకనిర్మాతలు.

ఈ చిరు టైటిల్స్ గోల ఎందుకు అనుకున్నారో లేక తెలుగు నేటివిటీకి ఈ టైటిల్ బాగుంటుంది అనుకున్నారో కానీ ఈ సినిమాకి మాత్రం ఆ పేరు ఫిక్స్ అయ్యారు. తాజాగా అందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో కూడిన పోస్టర్‌ను నిన్న అధికారికంగా విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో కార్తి, జోతిక ముఖాలు సగం సగం మాత్రమే కనపడుతున్నాయి. అక్కగా జ్యోతిక తమ్ముడిగా కార్తీ ఈ సినిమాలో నటించారు. దృశ్యం సినిమా తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌ ఈ సినిమాకి దర్శకుడు. ఇక దొంగ సినిమాని ఈ డిసెంబర్‌ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నిజానికి డేట్ ఇంకా ఫిక్స్ చేయకున్నా అది డిసెంబర్ 20న రిలీజ్ చేయచ్చని భావిస్తున్నారు. ఇక టీజర్‌ త్వరలోనే విడుదల చేస్తారట. ఖైదీ బాక్సాఫీస్‌ దగ్గర 100 కోట్లకి పైగా వసూలు సాధించింది. 

More Related Stories