English   

షూట్ లో గాయపడ్డ హీరోయిన్ 

Parineeti Chopra
2019-11-16 15:46:43

బాలీవుడ్ లో వరుస అవకాశాలతో బిజీగా ఉంది పరిణీతి చోప్రా. నిజానికి తెలుగులో ఆర్ఆర్ఆర్లో కూడా ఆమెను నటింప చేయాలని ప్రయత్నించినా ఆమె బిజీ షెడ్యూల్ వలన అది కుదరలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఆమె బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది. అయితే ఆమె సినిమా సైన్  చేసినంత ఈజీ కాదని ఇప్పుడు అవగతం అవుతోందట. ఆమె ఈ సినిమాలో నటించేందుకు గాను బాడీ ఫిట్ నెస్ కోసం అలాగే బ్యాడ్మింటన్ మీద అవగాహన తెచ్చుకునేందుకు ఆమె ఇక్కడికి వెళ్లినా ఆమె వెంట ఒక సుశిక్షితుడైన బ్యాడ్మింటన్ కోచ్ ఆమె వెంట ఉండే లాగా ప్లాన్ చేసుకుని మరీ ప్రాక్టీస్ చేసింది. 

తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పరిణితీ చోప్రా తీవ్రంగా గాయపడింది. మెడపై దెబ్బ తగిలినట్టు కనబడుతోంది. ఈ విషయాన్ని పరిణితీ చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ సినిమా కోసం మా యూనిట్ నేను ఎంతో కష్ట పడుతున్నాం. నాకు గాయాలు కాకుండా ఉండడానికి చాలా ప్రయత్నించినా కుదరలేదు. ఆ గాయం అవనే అయ్యింది. ఇప్పుడు ఇది తగ్గేదాకా వెయిట్ చేయక తప్పదని ఆమె రాసుకొచ్చింది. అమోల్ గుప్తా దర్శకత్వంలో టీసిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Related Stories