English   

అస్వస్థతకి గురయిన బాలీవుడ్ హీరో 

 Sushant Singh Rajput
2019-11-16 15:53:25

తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారత దేశాన్ని డెంగీ జ్వరాలు కుదిపేస్తున్నాయి. డెంగీ దెబ్బకు సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు బాధితులుగా మిగిలిపోతున్నారు. ఈ ఏడాది పలువురు సెలెబ్రిటీలు డెంగీ బారిన పడ్డారు. ధర్మేంద్ర, జైన్ ఇమామ్, టీవీ నటుడు మొహ్సిన్ ఖాన్ డెంగీ బారిన పడి బయట పడ్డారు. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెంగీ బారిన పడ్డాడు. యూరప్ ట్రిప్ ను ముగించుకుని వచ్చిన సుశాంత్ ఆరోగ్యం బాలేక వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఈ పరీక్షలో డెంగీ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో, తన అబుదాభి పర్యటనను సుశాంత్ రద్దు చేసుకున్నాడు. 

ఈ విషయాన్ని ముంబై మిర్రర్ వెబ్ సైట్ పేర్కొంది. ఈ వారంలో సుశాంత్ అబుదాభి వెళ్లాల్సి ఉంది. కానీ డెంగీ వలన విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించడంతో, అబుదాభి పర్యటన రద్దు చేసుకున్నాడు. మరోవైపు, సుశాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఈ జ్వరం సోకినప్పుడు వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి వారిచ్చిన మందులు వాడాలి. ఈ వ్యాధి అని తెలియక అశ్రద్ద చేస్తే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది.

More Related Stories