English   

మళ్ళీ ఆ హిట్ కాంబినేషన్...మళ్ళీ కొడతారా 

Hebah Patel
2019-11-16 16:03:53

హెబ్బా పటేల్ 'కుమారి 21 ఎఫ్‌' చిత్రంతో టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. ఆ ఒక్క సినిమాతో యువతలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది హెబ్బా. ఆ తర్వాత ఆ అమ్మడికి చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా తగల్లేదు. అరడజను సినిమాలు చేస్తే అందులో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా కాస్త హిట్ అయ్యింది. అయితే సినిమాలు ఏవీ ఆడకున్నా ఆమె మాత్రం సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా వుంటుంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఆ హాట్ నెస్ ఇప్పుడు మరో సినిమా తెచ్చిపెట్టింది. రాజ్ తరుణ్ కొండా విజయ్ కుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

నిర్మాత కేకే రాధామోహన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే రాజ్ తరుణ్ సరసన మాళవిక నాయర్ ను నాయికగా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలోనే రెండో నాయిక కోసం హేబ్బాను ఎంపిక చేసుకున్నారట. ఈ మేరకు నిన్న చిత్ర నిర్మాణ సంస్థ నుండి ఒక ప్రకటన వెలువడింది. తాజా షెడ్యూల్‌ హైదరాబాద్ లో జరుగుతుండగా నిన్నటి నుంచి హెబ్బా ప‌టేల్ యూనిట్‌తో జాయిన్ అయ్యారు. ఆమెపై కీల‌క స‌న్నివేశాల‌ను షూట్ చేస్తున్నట్టు సమాచారం. నిజానికి ఇప్పుడు ఈ ఇద్దరికీ హిట్ చాలా అవసరం. రాజ్ తరుణ్ కి కిట్టు ఉన్నాడు జాగ్రత్త తర్వాత చెప్పుకోదగ్గ సినిమా లేదు. హేబ్బా పరిస్థితి కూడా దాదాపు అదే. మరి ఈ సినిమా అయినా వీరికి ఆ సక్సెస్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

More Related Stories