నయనతారకు పెళ్లి గండం ఉందా.. అందుకే ఇదంతా..

ఏమో ఇప్పుడు తమిళనాట వినిపిస్తున్న వార్తలు అయితే ఇవే. నయనతారకు పెళ్లి గండం ఉందని.. అందుకే ఆమె పెళ్లికి దూరంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మరో ఆసక్తికరమైన వార్త కూడా ఇప్పుడు తమిళనాట వినిపిస్తుంది. అదే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుందని.. ఇలా అని ఓ జ్యోతిష్కుడు నయనతారకు చెప్పాడని అది నమ్మే ఇప్పటి వరకు పెళ్లికి దూరంగా ఉందని తెలుస్తుంది.
ఇప్పటికే మూడు సార్లు ప్రేమలో పడింది నయన్. శింబుతో పెళ్లి వరకు వెళ్లిన వ్యవహారం ఆగిపోయింది.. ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా అంతే. ఇక ఇప్పుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది నయన. వీళ్లిద్దరూ మూడేళ్లుగా కలిసే ఉంటున్నారు. పెళ్లి మాత్రమే కాలేదంతే. అయితే విఘ్నేష్ నే పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నా.. ప్రేమబంధంతోనే సరిపెడుతుంది కానీ పెళ్లి బంధంలోకి మాత్రం అడుగు పెట్టరాదని ఫిక్సైపోయింది నయన్. అందుకే విఘ్నేష్ గురించి ఎప్పుడు అడిగినా కూడా ఫ్రెండ్ కంటే ఎక్కువ.. ఆత్మీయుడు అంటుందే కానీ అంతకుమించి మాట్లాడటం లేదు.
దీనికి అంతటికి కారణం ఆమె జాతకం అని ప్రచారం జరుగుతుంది. ఈమె రాజకీయాల్లోకి కూడా వస్తుందని.. కచ్చితంగా ఆ ఆసక్తి కూడా చూపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమ్మ ఉన్నపుడే ఆమె పార్టీలోకి రావాలని చూసింది నయన. కానీ ఆ తర్వాత కుదర్లేదు.
అయితే ఇప్పుడు ఈమెకు ఉన్న ఇమేజ్ కు కచ్చితంగా ఏదో ఓ రోజు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. మరి చూడాలిక.. పెళ్లికి దూరంగా ఉండి అమ్మ మాదిరే ఈమె కూడా ముఖ్యమంత్రి పీఠం వరకు వెళ్తుందేమో..?