English   

జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణం పవన్ కల్యాణ్..

Pawan Kalyan latest news.jpg
2019-11-17 07:31:15

అవును.. నమ్మడం కాస్త కష్టమే అయినా కూడా ఇప్పుడు ఇదే జరిగింది మరి. కేవలం పవన్ కల్యాణ్ కారణంగానే ఇప్పుడు జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుక రద్దయింది. ఆయన వస్తున్నాడు కాబట్టే తెలంగాణ పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. నెక్లెస్ రోడ్ లో భారీగా జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసారు దర్శక నిర్మాతలు. విడుదలకు 5 రోజుల ముందు ఈ వేడుక చేసి సినిమాపై అంచనాలు పెంచాలని చూసారు.

ఉస్మానియా విద్యార్థి నాయకుడు.. 45 ఏళ్ల కింద మరణించిన జార్జ్ రెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జీవన్ రెడ్డి. వంగవీటి ఫేమ్ స్యాండీ ఈ సినిమాలో హీరో. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కల్యాణ్ వస్తున్నాడని చిత్రయూనిట్ కూడా చెప్పింది. అయితే ఆయన వస్తే కచ్చితంగా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని భావించి పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. దాంతో నవంబర్ 17న జరగాల్సిన ప్రీ రిలీజ్ వేడుక రద్దైపోయింది.

ఈ ఈవెంట్‌కు పవన్ అభిమానులతో పాటు స్టూడెంట్ యూనియన్స్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రానున్నారు. దాంతో కచ్చితంగా పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పర్మిషన్ ఇవ్వలేదు.

More Related Stories