English   

ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్రీ అట

chetan
2019-11-17 08:06:03

రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి సినిమాల్లో నటించిన చేతన్ మద్దినేని తొలిసారి హీరోగా నటిస్తూ దర్శకత్వం చేసిన సినిమా బీచ్‌ రోడ్‌ చేతన్‌. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ ని నిన్న విడుదల చేసారు. ఇక ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్‌ కాబోతోంది. ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో టికెట్స్ ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచితంగా ఇస్తున్నారట. దాదాపు 200 థియేటర్స్‌లో సినిమా రిలీజ్‌ అవుతుండగా ఆ అని థియేటర్స్ లో ఈ సినిమాకి టికెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఈ సినిమా అంతా హైదరాబాద్ , వైజాగ్‌లో షూట్ జరిగినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో 150 మంది కొత్త ఆర్టిస్ట్‌లు నటించారట.  బీచ్ రోడ్‌లో తిరిగే ఒక బేవర్స్ కథట ఇది. బీచ్ అనగానే యూత్‌ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది. మరి ఈ సినిమాలో ఏమేం చూపించారో సినిమా రిలీజ్ అయితే కానీ చెప్పలేం.

More Related Stories