English   

అసురన్ డైరెక్టర్ గా కొత్త పేరు

srikanth
2019-11-17 09:01:01

తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్‌ తెలుగులో రీమేక్ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నారు. ఈ రీమేక్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోతున్నారు. అయితే ఈ సినిమాని ఎవరు తెరకేక్కిస్తారు అనే విషయం మీదనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టును దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తారనే టాక్ టాలీవుడ్‌లో నడిచింది..

అయితే, తాజా సమాచారం ప్రకారం బ్రహ్మోత్సవం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పేరు వినిపిస్తోంది. ఇప్పటికే సురేష్ బాబు తోచర్చలు సాగుతున్నాయని త్వరలోనే ఈ సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  నిజానికి  శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయాల్సి ఉంది.  అయితే దానికి మరికొంత సమయం పట్టేలా ఉండడంతో ఆయన వేరే అవకాశాల కోసం చూస్తున్నారు. దీంతో అడ్డాలకు 'అసురన్' రీమేక్ ఛాన్స్ వచ్చిందని సమాచారం. శ్రీకాంత్ అడ్డాల గతం లో తెరకెక్కించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా లో వెంకటేష్ ఒక హీరో గా నటించిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం పట్ల వెంకీ కూడా ధైర్యంగా ఉన్నాడని అంటున్నారు.

More Related Stories