ప్రతీరోజూ పండగే సినిమాలో మారుతి కుమార్తె

సుప్రీమ్ హీరో సాయితేజ్, రాశీఖన్నా జంటగా నటిస్తున్న సినిమా ప్రతి రోజూ పండగే. ఇప్పటిదాకా విలక్షణ సినిమాలు తెరకెక్కించిన మారుతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఈ మధ్యనే బావా..మా అక్కను సక్కగ సూస్తావా అంటూ సాగే ఒక పాట టీజర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ పాటలో రాశీఖన్నీ సోదరిగా ఇద్దరమ్మాయిలు మెరవగా అందులో భరతనాట్యం డ్రెస్ లో వున్న ఆ అమ్మాయి పేరు అభీష్ట అట. ఆ అమ్మాయి ఎవరో కాదు డైరక్టర్ మారుతి చిన్న కుమార్తేనట.
ప్రతిరోజూ పండగే సినిమాలో రాశీఖన్నా ముగ్గురు చెల్లెళ్లలో ఒకరిగా అభీష్ట కనిపించబోతోందని అంటున్నారు. ఆమె తండ్రిలానే ఆర్టిస్ట్ అంటే చిత్రకారణి. అయితే ఎటూ అవకాశం ఉంది కాబట్టి నటనా రంగంలోకి కూడా అడుగుపెట్టిందట. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సత్యరాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నా