English   

ఏపీ రాజకీయాల్లో మరో చిచ్చు.. వంశీ నోట వర్మ మాట..

vamsi
2019-11-17 16:26:29

రామ్ గోపాల్ వర్మ సినిమా దర్శకుడు.. కానీ ఈయనకు రాజకీయాలపై కూడా మంచి పట్టుంది. అలాగని రాజకీయాలు చేయడు.. చేసే వాళ్లను చూస్తూ ఊరుకోడు. ఎప్పుడూ ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటాడు ఆర్జీవి. అప్పుడే పొగలు వస్తుంటాయి.. ఒక్కోసారి భారీగా మంటలు కూడా వస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే చేసాడు వర్మ. ఈయన చేస్తున్న ఒక్క సినిమా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తుంది. అదే అధికార పార్టీకి ఆయుధంగా కూడా మారుతుంది. ఈ మధ్యే తెలుగుదేశం నుంచి వైసీపీ వైపు వెళ్లాడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈయన ఓ సంచలనం. పోతూ పోతూ తెలుగుదేశం పార్టీ నాయకులని కూడా ఓ రేంజ్‌లో విమర్శించాడు వంశీ. అందులో భాగంగానే నారా లోకేష్‌పై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు వంశీ. పప్పు అంటూ రెచ్చిపోయాడు. ఇదే విషయంపై క్లారిటీ ఇస్తూ తానెప్పుడు పప్పు అని లోకేష్‌ను అనలేదని.. అతన్ని బాబు అని పిలుస్తానని చెప్పాడు ఈయన. లోకేష్‌ను ఏపీ పప్పు అని తాననలేదని.. ఆ రామ్ గోపాల్ వర్మ గాడు అన్నాడని చెప్పాడు.

వాన్నేమీ పీకలేక తనను ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదంటున్నాడు ఈయన. అంతేకాదు.. గూగుల్లో ఏపీ పప్పు అని కొడితే లోకేష్ బొమ్మ రావట్లేదా అంటూ రెచ్చిపోయాడు వంశీ. ఇదంతా చేసిన ఆ వర్మను పట్టుకోలేక.. ఆడెక్కడో ముంబైలో ఉంటాడు.. గెలికితే మళ్లీ ఏం చూపిస్తాడో అని భయపడి తనను అంటున్నారంటూ ఫైర్ అయ్యాడు వంశీ. వర్మను మళ్లీ ఏమంటే చెరుకు రసం తీయగా ఉందనో.. పాలు తీయగా ఉన్నాయనో.. లేదంటే పప్పు వేస్తున్నట్లు చూపిస్తాడనో భయపడి మధ్యలో తననెందుకు అంటున్నారో అర్థం కావడం లేదని చెబుతున్నాడు వల్లభనేని. మొత్తానికి ఘాటుగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలిక. అన్నట్లు కమ్మరాజ్యంలో సీక్వెల్ రెడ్డిరాజ్యంలో కమ్మఫ్యాన్స్ అని వర్మ చేస్తాడంట.. మీ అభిప్రాయం ఏంటి అని వంశీని అడిగితే ఎవడిష్టం వాడిది అంటూ సమాధానమిచ్చాడు ఈయన.

More Related Stories