English   

రాక్షసితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందట

ramya
2019-11-17 17:07:26

దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘రొమాంటిక్’. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరీ జగన్నాథ్ అందిస్తున్నారు. అనిల్ పాడూరి అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఆయన ఆరంగ్రేటం చేస్తున్నారు. అందమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న రొమాంటిక్ ఇప్పటికే హైదరాబాద్‌, గోవాలలో రండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేశారు. తాజాగా మళ్ళీ ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతున్నది. కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అలనాటి రొమాంటిక్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ర‌మ్యకృష్ణ రొమాంటిక్ సెట్‌ లోకి అడుగుపెట్టింది. చిత్ర నిర్మాత ఛార్మితో ర‌మ్య ముచ్చటిస్తున్న ఫోటో ఒక‌ దానిని రమ్యకృష్ణ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. పూరీజగన్నాథ్‌, నా రాక్షసి ఛార్మితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని రమ్యకృష్ణ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. రమ్యకృష్ణ  ట్వీట్‌పై స్పందించిన ఛార్మి ‘మీరు మన ‘రొమాంటిక్‌’ చిత్రానికి మరింత అందాన్ని తీసుకువచ్చారు. లవ్‌ యూ.’ అని రీ ట్వీట్ చేశారు. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ నటులు మకరంద్ దేశ్ పాండే, మందిరాబేడీ కీలకపాత్రలలో నటిస్తున్నారు.

More Related Stories