English   

సాయి ధరమ్ తేజ్ ని ఏరా అనేసిన నెటిజన్..

sai
2019-11-17 17:22:39

ఈ రోజుల్లో హీరోలు తమ సినిమా అప్ డేట్స్ విషయంలో అస్సలు తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సాయి కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. డిసెంబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ చిత్ర అప్ డేట్స్ గురించి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. కాసేపు సరదాగా అభిమానులతో లైవ్ ఛాట్ కూడా చేసాడు సాయి. వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సాయికి అదిరిపోయే షాక్ ఇచ్చాడు.

ఆయన్ని ఏరా అంటూ ఏకవచనంతో పిలవడమే కాకుండా ఏరా సినిమాలో కామెడీ ఇదే రేంజ్‌లో ఉంటుందా లేదా అని అడిగాడు. దానికి సాయి కూడా అంతే సరదాగా సమాధానమిచ్చాడు. లేదురా దీనికి 1000 రేట్లు ఎక్కువగా ఉంటుంది అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో సదరు అభిమాని షాక్ అయ్యాడు. వెంటనే తన తప్పు తెలుసుకుని సారీ అన్నా.. సినిమాకు గుడ్ లక్ అని చెప్పాడు.

దానికి బ్రహ్మానందం ఫోటోలు కూడా పెట్టాడు. సాయి ధరమ్ తేజ్ కూడా బ్రహ్మానందం ఫోటోతోనే రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ఈ ఇద్దరి కాన్వర్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఇక ప్రతిరోజూ పండగేలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. చిత్రలహరి సినిమాతో హిట్ కొట్టిన సాయి.. అదే జోరు చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. కచ్చితంగా ఈ చిత్రంతో మరో హిట్ అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు కూడా. మరోవైపు మారుతికి కూడా ఈ చిత్రం కీలకమే. శైలజారెడ్డి అల్లుడు అంచనాలు అందుకోకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు మారుతి.

More Related Stories