English   

జబర్దస్త్ నుంచి నాగబాబు ఔట్.. అనసూయ కూడా..

anu
2019-11-18 05:14:30

ఏడేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోలో ఉన్నాడు నాగబాబు. ఆయన నవ్వులకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ నవ్వులకు ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరికి వచ్చేసింది. ఇన్ని రోజులు రూమర్స్ అనుకున్నారు కానీ నిజంగానే ఇప్పుడు నాగబాబు జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పేసాడని తెలుస్తుంది. దానికి కారణాలు పెద్దగా ఏం లేవు.. సింపుల్ డబ్బులు ఎక్కువిస్తున్నారు అక్కడ్నుంచి ఇక్కడికి వచ్చేసాడు. అంతకంటే మరో కారణాలు కూడా కనిపించడం లేదు. ఈటీవీ నుంచి ఇప్పుడు జీ టీవీకి మారిపోయాడు ఈయన. ఆయనతో పాటు అనసూయ కూడా వచ్చేసింది.

ఇప్పటికే జీ తెలుగులో ప్రోమోలు కూడా వరసగా విడుదలవుతున్నాయి. దాన్నిబట్టి చూస్తుంటే నాగబాబుకు జబర్దస్త్ కామెడీ షోతో ఉన్న అనుబంధం తెగిపోయినట్లే కనిపిస్తుంది. మరి రోజా కూడా కంటిన్యూ అవుతుందా లేదంటే ఆమె కూడా మానేస్తుందా అనేది చూడాలిక. ప్రస్తుతం నాగబాబుతో పాటు అనసూయ కూడా వచ్చేసింది. పటాస్ నుంచి రవి కూడా తప్పుకున్నాడు. ఇలా అంతా ఒకేచోట చేరి మరో కొత్త ప్రోగ్రామ్ కు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే వీళ్లతో పాటు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఛమ్మక్ చంద్ర టీమ్స్ కూడా వచ్చేస్తున్నాయని తెలుస్తుంది. వాళ్లు కానీ వచ్చారంటే జబర్దస్త్ కామెడీ నడవడం కూడా కష్టమే అవుతుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..

More Related Stories