English   

పవన్ కల్యాణ్ సినిమాకు హరీష్ శంకర్ నో చెప్పాడా..

pk
2019-11-18 05:34:17

పవన్ కల్యాణ్ అంటే పడిచచ్పిపోయే దర్శకులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అందులో హరీష్ శంకర్ కూడా ఒక్కడు. పవన్ పదకొండేళ్ల దాహాన్ని తీర్చిన దర్శకుడు ఈయన. అందుకే మెగాభిమానులకు హరీష్ శంకర్ అంటే చాలా యిష్టం. గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు హరీష్. ఇలాంటి దర్శకుడు ఇప్పుడు పవన్ కల్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తే నో చెప్పాడని ప్రచారం జరుగుతుంది. పవన్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. పింక్ రీమేక్ తో మళ్లీ ఈయన సినిమాల్లోకి వస్తాడని వార్తలు వినిపిస్తున్నా ఇప్పటి వరకు అయితే ఆయన నోరు తెరిచి చెప్పింది లేదు. కానీ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ మాత్రం పింక్ రీమేక్ ఉంటుందని చెబుతున్నారు.

ఈ చిత్రానికి ముందు హరీష్ శంకర్‌ను తెరకెక్కించాలని కోరారని.. అయితే ఆయన మాత్రం సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తుంది. దీనివెనక పక్కా కారణాలు కొన్ని ఉన్నాయి. పవన్ లాంటి హీరో సినిమాకు ఆఫర్ వచ్చినా కాదనడానికి కారణం అది రీమేక్ కావడమే. ఇప్పటికే గబ్బర్ సింగ్, జిగర్తాండ సినిమాలు రీమేక్ చేసాడు హరీష్. అందుకే ఇంక రీమేక్ సినిమాలు మానేసి.. సొంత టాలెంట్ నమ్ముకోవాలని చూస్తున్నాడు. అందుకే నో చెప్పాడు ఈ దర్శకుడు. హరీష్ నో చెప్పిన తర్వాతే వేణు శ్రీరామ్‌ను దర్శకుడిగా ఎంచుకున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతో వాళ్లకే తెలియాలి.

More Related Stories