English   

జనానికి తెలియని సీక్రెట్ బయట పెట్టిన చిరంజీవి

Chiranjeevi ANR AWARDS CEREMONY.jpg
2019-11-18 13:18:16

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ జాతీయ అవార్డుల కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మకంగా ఏఎన్నార్ జాతీయ పురస్కారాలను అందజేస్తోంది. 2018...2019 సంవత్సరాలకు అవార్డులు ప్రకటించారు. 2018కి గాను దివంగత నటి శ్రీదేవికి...2019కి గాను నటి రేఖకు ఈ పురస్కారం దక్కింది. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరై అవార్డులను అందించారు. శ్రీదేవి తరపున బోనీకపూర్ పురస్కారం అందుకున్నారు. 

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ కార్యక్రమం సందడిగా సాగింది. ఇక అక్కినేని నాగేశ్వర రావు అంతటి స్థాయికి రావాలని తాను కూడా కలలు కన్నానని తెలిపారు నటి రేఖ. ఏఎన్నార్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రేఖ ఏఎన్నార్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అప్పుడు తాను చూసిన అక్కినేని సినిమాలను గుర్తు చేసుకున్నారు. ఆయన నటనను ఎంతగానో ప్రశంసించారు రేఖ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆరు దశాబ్దాల నాటి సంగతులను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇప్పటివరకు బయటి వ్యక్తులకు తెలియని ఓ విషయాన్ని సభాముఖంగానే వెల్లడించారు మెగాస్టార్. ఆయన చెప్పిన విధానం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. తన తల్లి అంజనా దేవికి అక్కినేని నాగేశ్వర రావును ఎలా అభిమానించే వారో చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. 

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, బాలీవుడ్ అందాల రాశి రేఖ ఇద్దరూ ఒకే వేదికపై ప్రేక్షకులను అలరించారు. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, రేఖ మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. రేఖ పూర్తిగా తెలుగులోనే మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కమర్షియల్ సినిమాలు, కళాత్మక సినిమాలను ఎలా బ్యాలన్స్ చేసుకునేవాళ్లు అని నాగ్ అడగ్గా, తనకు నటించడం ఒక్కటే తెలుసని బదులిచ్చారు. కమర్షియల్ చిత్రమా, కళాత్మక చిత్రమా, అది ఏ భాషా చిత్రమా అని ఎప్పుడూ చూసుకోలేదని, సినిమా ఈజ్ సినిమా అంటూ సమాధానం ఇచ్చారు రేఖ.

More Related Stories