భార్యను తలుచుకుని కన్నీరు పెట్టుకున్న బోనీ కపూర్..

శ్రీదేవి కన్నుమూసినా ఇంకా ప్రేక్షకుల మదిలో మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఆమె రూపం అంత సులభంగా చెరిగిపోదు. ఆమెపై ఉన్న అభిమానం కూడా అంత త్వరగా మాసిపోదు. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా కూడా శ్రీదేవి కంటే అందం మరోటి ఉండదు. అభినయంలోనూ ఆమె ఆకాశమే. ఆమె కెరీర్ లో చనిపోయిన తర్వాత నేషనల్ అవార్డ్ అందుకుంది శ్రీదేవి.
నటిగా ఎన్నో అవార్డులు అందుకున్నా.. ఎన్నో రికార్డులు సృష్టించినా.. ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా ఆమె బతికున్నపుడు రాని నేషనల్ అవార్డు చనిపోయిన తర్వాత వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అతిలోకసుందరి శ్రీదేవికి ఏఎన్నార్ జాతీయ అవార్డు వచ్చింది. 2018 ఏడాదికి గానూ ఇది ఇచ్చారు అక్కినేని కుటుంబం.
ఈఅవార్డు తీసుకోడానికి వచ్చిన బోనీ కపూర్ తన భార్య గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆయన కంట కన్నీరు ఆగలేదు. అక్కడున్న వాళ్లు కూడా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయారు. కనీసం మాట్లాడలేక ఏడ్చుకుంటూ అలాగే స్పీచ్ ఆపేసి వెళ్లిపోయాడు బోనీ కపూర్. తర్వాత చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాడు బోనీ కపూర్. అక్కినేనితో చాలా సినిమాలు చేసిన శ్రీదేవి.. ఆ తర్వాత రోజుల్లో నాగార్జునతో కూడా నాలుగు సినిమాల్లో నటించింది.
2018, ఫిబ్రవరిలో శ్రీదేవి దుబాయ్ లో ఓ వివాహానికి వెళ్లి అనుమానాస్పద రీతిలో మరణించింది.