English   

మాకొద్దీ నయనతార అంటున్న టాలీవుడ్ దర్శక నిర్మాతలు.. 

Nayanathara
2019-11-18 14:19:47

ఎంత టాలెంట్ ఉన్నా కూడా దర్శక నిర్మాతలు చెప్పినట్లు వినకపోతే ఇక్కడ అస్సలు వర్కవుట్ అవ్వదు. ఒక్కోసారి స్టార్ హీరోలు కూడా దర్శకుడు చెప్పినట్లు నడుచుకోవాల్సి వస్తుంది. అలాంటిది నయనతార మాత్రం అంతా నా యిష్టం అంటుంది. అందుకే ఇప్పుడు ఈమెతో సినిమా అంటేనే వామ్మో అంటున్నారు తెలుగు దర్శక నిర్మాతలు. ఒక్కముక్కలో చెప్పాలంటే నయనతారను సైరా సినిమా తర్వాత పూర్తిగా బ్యాన్ చేసారు. కావాలనే దూరం పెడుతున్నారు మన దర్శక నిర్మాతలు. దానికి కారణాలు కూడా లేకపోలేవు. 

అన్నీ ఆమె చెప్పినట్లు జరగాలనుకునే మొండి వైఖరిని మనోళ్లు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా డేట్స్ విషయంలో నయన్ చాలా పక్కాగా ఉంటుంది.. ప్రమోషన్ కు రాదు.. రెమ్యునరేషన్ ఎక్కువ కావాలి.. ఇన్ని కండీషన్స్ పెడుతున్నందుకే నయన్ అంటే వద్దులే అంటున్నారు. ఆ స్థానంలో మరో స్టార్ హీరోయిన్ వైపు అడుగేస్తున్నారు దర్శక నిర్మాతలు. దానికితోడు మొన్న సైరా విషయంలో నయనతార కనీసం ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కు కూడా రాకపోవడంతో బాగా ఫీలయ్యాడు చిరంజీవి. 

ఇక అంతకుముందు వెంకటేష్ హీరోగా వచ్చిన బాబు బంగారం సినిమా సమయంలో తమ షూటింగ్‌కు నయనతార సరిగ్గా సహకరించడం లేదంటూ దర్శకుడు మారుతి సంచలన కమెంట్స్ చేసాడు. ఆ తర్వాత నయన్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. తాను ఇచ్చిన డేట్స్ వాళ్లు యూజ్ చేసుకోలేదని.. తానేం చేయలేనని చెప్పేసింది. ఓ పాట తీయడానికి చాలా చుక్కలు చూపించిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక మరో సీనియర్ హీరోతో నటించేటప్పుడు కూడా ఎక్కువగా ముట్టుకోరాదనే చిత్రమైన కండీషన్ పెట్టిందని తెలుస్తుంది. ఇలా తనకు నచ్చినట్లు ఉండటంతో ఆమె వైపు కన్నెత్తి చూడ్డానికి కూడా భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. 

More Related Stories