English   

యాంకర్ గా మారిన శ్రీ రెడ్డి.. కత్తి మహేష్ తో ఇంటర్వ్యూ..

Sri Reddy
2019-11-18 16:01:34

తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్షియల్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇది శ్రీ రెడ్డి.. తర్వాత కత్తి మహేష్. ఇద్దరూ పవన్ కళ్యాణ్ ను బీభత్సంగా టార్గెట్ చేసి ఫేమస్ అయ్యారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. వీలు దొరికినా ప్రతిసారి జనసేన అధినేత పై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసి క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. అందులో చాలా సంచలన విషయాలను గురించి మాట్లాడుకున్నారు కత్తి మహేష్ శ్రీ రెడ్డి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఇంటర్వ్యూ అంతా సాగింది. కత్తి మహేష్ కావాలని పదేపదే పవన్ కళ్యాణ్ పేరు తీశాడు. అభిమానులను ఉడికించేలా కొన్ని అసభ్యకరమైన పదజాలం వాడాడు. దానికి శ్రీ రెడ్డి కూడా సపోర్టు ఇవ్వడంతో ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు యూ ట్యూబ్లో సంచలనంగా మారింది. దానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. కేవలం కొన్ని సెకన్ల పాటు ఉన్న ప్రోమో లోనే పవన్ కళ్యాణ్ తో ఇంతగా ఆడుకుంటే మొత్తం ఇంటర్వ్యూలో ఎలా ఉంటుందో అని పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

అయినా కావాలని ఇలా పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని సెటైరికల్ ఇంటర్వ్యూలు చేయడం ఎవరికీ మంచిది కాదు అంటున్నారు విశ్లేషకులు. తన పనేదో తాను చేసుకుంటున్నా కూడా పవన్ కళ్యాణ్ ను అలా ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు.. అది సరైన పద్ధతి కాదు అంటూ కత్తి మహేష్ శ్రీ రెడ్డి కి నెటిజన్ల నుంచి వార్నింగ్ లు వెళ్తున్నాయి. అయినా కూడా ఎవరి మాట వినడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్గా ఇంటర్వ్యూ చేసి మరింత ఫేమస్ కావాలని చూస్తున్నారు. మరి మొత్తం ఇంటర్వ్యూ బయటికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

More Related Stories