English   

బోనీ కపూర్ నిర్మాణంలో నయనతార.. వాట్ ఏ కాంబినేషన్..

nayan
2019-11-19 05:50:39

బోనికపూర్ అంటే ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ శ్రీదేవి చనిపోయిన తర్వాత ఆయన తన నిర్మాణ సంస్థను ఎందుకో తెలియదు కానీ సౌత్ ఇండస్ట్రీకి కూడా విస్తరిస్తున్నారు. ఇక్కడ వరస సినిమాలు నిర్మించడానికి నిర్ణయించుకున్నాడు బోనీ కపూర్. ఈ క్రమంలోనే తమిళ్లో అజిత్ హీరోగా పింక్ సినిమా రీమేక్ చేసాడు. తాజాగా అదే కాంబినేషన్లో మరో సినిమా కూడా నిర్మించబోతున్నాడు బోని. పింక్ రీమేక్ నేర్కొండ పార్వై సినిమా తెరకెక్కించిన వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. చిత్ర షూటింగ్‌ డిసెంబరులో మొదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో అజిత్‌ పోలీస్‌ అధికారిగా నటించనునున్నట్లు సమాచారం. ఆయన ఇంతకుముందు ఎన్నై అరిందాళ్, ఆంజనేయ, మంగాత్తా చిత్రాల్లో పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి వలిమై అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది అజిత్‌కు 60వ చిత్రం. ఈ సినిమాలో అజిత్కు జోడిగా నయనతార పేరును పరిశీలిస్తున్నారు దర్శక నిర్మాతలు.

అందుకే బోనీ కపూర్ అమెరికాలో ఉన్న నయనతారను కలిశాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈమె తన పుట్టిన రోజు వేడుకలను ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి అమెరికాలో జరుపుకుంటుంది. అక్కడే బోనీకపూర్, నయనతార ప్రత్యేకంగా కలిసారు. వాళ్లతో పాటు బోని చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా ఇందులో ఉంది. అజిత్ వలిమై చిత్రంలో నయనతార నటించమని అడగడానికి ఈ ప్రత్యేకమైన భేటీ జరిగిందని తెలుస్తోంది. అజిత్, నయనతార ఇంతకుముందు ఏకన్, ఆరంభం, విశ్వాసం చిత్రాల్లో జతకట్టారు. వీటిలో ఆరంభం, విశ్వాసం మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో వలిమై చిత్రంతో ఈ జంట మరోసారి కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్నట్లు బోనికపూర్ తెలుగులో కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ హీరోగా పింక్ సినిమాను రీమేక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు బోనీకపూర్.

More Related Stories