టెన్షన్లో ఉన్న ఘట్టమనేని అభిమానులు

మహేష్ బాబు మేనల్లుడు, టిడీపీ ఎంపి గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరో గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొన్ననే పూజా కార్యక్రమాలతో మొదలయిన ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుగుతోంది. ఇక పది రోజుల కిందట షూటింగ్ స్టార్ట్ చేసిందో లేదో అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుందట. ఈ విషయాన్ని తాజాగా ఈ సినిమా దర్శకుడు ట్వీట్ ద్వారా తెలిపారు. మా సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది… ఈ సందర్భంగా గల్లా జయదేవ్ సెట్స్‌కి వచ్చి టీం అందరితో సరదాగా గడిపారని దర్శకుడు శ్రీరామ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. అయితే ఇంత ఫాస్ట్ గా షూట్ జరపడం వలన మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా అశోక్ హీరోగా దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా మొదలయి షూట్ కూడా జరుపుకుంది. తర్వాత అవుట్ పుట్ నచ్చక దానిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఏమవుతుందో అనే టెన్షన్లో ఉన్నారు ఘట్టమనేని అభిమానులు.