English   

రంగమార్తాండకి ఇంటరెస్టింగ్ క్యాస్టింగ్...ఆరోజునే మొదలు

 Ranga Marthanda
2019-11-19 10:50:58

నక్షత్రం తరువాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ కొద్దీ రోజుల క్రితం తన కొత్త సినిమా ప్రకటించారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ఆయన మళ్ళీ ఎలాగైనా ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. అందుకే ఆయన మరాఠీలి సూపర్ హిట్ అయిన నట్ సామ్రాట్ ను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేయగా నానా పటేకర్ లీడ్ రోల్ లో నటించాడు . ఈ సినిమా ఉత్తమ మరాఠి చిత్రంగా అవార్డు ను గెలుచుకుంది. ఈ సినిమా ఒక రంగస్థల నటుడి జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాని లుగులో రంగమార్తాండ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ లో నటుడు ప్రకాష్ రాజ్, కృష్ణ వంశీ సతీమణి రమ్యకృష్ణ లీడ్ రోల్స్ లో నటించనుండగా మరో రెండు కీలక పాత్రల కోసం హీరోయినా అవికా గోర్, ప్రముఖ యాంకర్ కమ్ నటి అనసూయను కూడా తీసుకున్నారని సమాచారం. వీరితో పాటు హ్యాపీడేస్, వంగవీటి ఫేమ్ వంశీ చాగంటి కూడా ఈ చిత్రంలో నటించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాని ఈ నెల 28న ప్రారంభించనున్నారు. ఆ రోజున ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడున్నాయి. రెడ్ బుల్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై అభిషేక్ జ్వకర్, మధు కలిపు నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభం అయిన కొద్దిరోజుల్లోనే సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది.

More Related Stories