English   

లారీ డ్రైవర్ గా మారనున్న బన్నీ

Allu Arjun
2019-11-19 11:21:41

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ‘అల వైకుంఠపురములో’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతికి ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత దర్శకుడు సుకుమార్ తో కలిసి బన్నీ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందనే ప్రచారం ముందు నుండీ జరుగుతోంది. అంతే కాక రంగస్థలంలో రామ్ చరణ్ ఎలా అయితే రగడ్ లుక్ లో కనిపించాడో ఇక్కడ కూడా ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో రఫ్ లుక్ తో బన్నీ కనిపించనున్నాడని అంటున్నారు.

ఇక ఆయన ఈ పాత్రలో చిత్తూరు యాసలో మాట్లాడతాడని అంటున్నారు. చిత్తూరు యాసలో మాట్లాడటం కోసం బన్నీ ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ను నియమించుకున్నాడని చెబుతున్నారు. ఈ వార్తలకి ఊతం ఇచ్చేలాగా ఈ సినిమాలో నటించేందుకు చిత్తూరు జిల్లా యువకులు కావాలని క్యాస్టింగ్ కాల్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించనుండగా, విలన్ గా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.

More Related Stories