English   

బాలకృష్ణకు అంత సీన్ లేదని తేల్చేసిన వర్మ..

 Ram Gopal Varma
2019-11-19 13:39:54

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరో ఒకరిని గెలుకుతూనే ఉంటాడు. ఎప్పుడూ ఎవరో ఒకరితో సున్నం పెట్టుకోకపోతే వర్మకు నిద్ర రాదు. ఇప్పుడు మరోసారి ఆయన నందమూరి అభిమానులను టార్గెట్ చేశాడు. ప్రస్తుతం ఈయన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. నవంబర్ 29 న ఈ చిత్రం విడుదల కానుంది. దాంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ సినిమా తిరగనుంది. 

మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం దారుణంగా ఓడిపోయిన తర్వాత కథ రాసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇందులో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్, కేఏపాల్ ఇలా చాలా మంది సెలబ్రిటీల పాత్రలను సృష్టించాడు వర్మ. కానీ ఎందుకో తెలియదు మరి నందమూరి బాలకృష్ణను మాత్రం వదిలేసాడు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ట్రైలర్లు పోస్టర్లలో కానీ ఎక్కడా బాలయ్య కనిపించలేదు. దానికి కారణం వర్మ బాలకృష్ణకు భయపడ్డాడు అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈసారి కచ్చితంగా బాలయ్య అభిమానులు భౌతిక దాడి చేస్తారు.. అందుకే భయపడి బాలకృష్ణ పాత్ర కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పెట్టలేదు అన్నారు ఫ్యాన్స్.

కానీ వర్మ మాత్రం దీనికి దిమ్మతిరిగిపోయే సమాధానం చెప్పాడు. ఎందుకో తెలియదు బాలకృష్ణకు ఈ సినిమాలో ఉండే సీన్ లేదు అనిపించింది.. ఆయన పాత్ర నాకు పెద్దగా ఇంపార్టెంట్ అనిపించలేదు అందుకే ఈ సినిమాలో బాలకృష్ణ లేడు అంటూ సమాధానమిచ్చాడు వర్మ. దాంతో నందమూరి అభిమానులకు ఎక్కడో మండిపోతుంది. మొత్తానికి వర్మ ఏం చేసినా సంచలనమే. బాలయ్య పాత్ర సినిమాలో ఉన్నా లేకపోయినా కూడా ఆయన అభిమానులను మాత్రం టార్గెట్ చేస్తూనే ఉన్నాడు ఈ దర్శకుడు.

More Related Stories