English   

ఇవాళ షూటింగ్ మొదలు పెట్టి అప్పుడే రిలీజ్ డేట్ లాక్ చేసేశారు !

said
2019-11-19 20:46:02

వరుస పరాజయాల అనంతరం సాయి తేజ్ గా రూపాంతరం చెందిన సాయి ధరమ్ తేజ్ చిత్రలహరితో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. బంపర్ హిట్ అని చెప్పలేం కానీ అయినంతలో బాగానే ఆడింది సినిమా. దీంతో జోరు పెంచిన ఈ మెగా మేనల్లుడు ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ప్రతిరోజు పండగే అనే సినిమా చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా వుంది. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా…అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ అయిపోక ముందే తన కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటరూ అనే టైటిల్ తో  ప్రకటించిన తేజూ ఈరోజు ప్రపంచ పురుషుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చారు. ఈ రోజే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినట్టుగా ఉన్న పోస్టర్ అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అప్పుడే ఫిక్స్ చేస్తూ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించ‌నున్న ఈ చిత్రం ద్వారా సుబ్బు నిక్కీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో `ఇస్మార్ట్ శంక‌ర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా నటించనుంది.

More Related Stories