English   

హమ్మయ్య మొత్తానికి మొదలెట్టారు !

mb
2019-11-19 20:53:36

హ్యాట్రిక్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌ లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పదమూడేళ్ళ తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండగా, బండ్ల గణేష్ కూడా ముఖానికి రంగేసుకున్నారు. ఇక అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ అల వైకుంటపురం సినిమాతో పోటీగా వస్తున్న ఈ సినిమా ఇప్పటి దాకా ప్రమోషన్స్ పూర్తి స్థాయిలో మొదలు పెట్టలేదు. సమయం దగ్గర పడడం పోటీగా వస్తున్న మంచి జోరుగా ప్రమోషన్స్ చేపట్టడంతో ఈ సినిమా కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఇన్ని రోజులు కేవలం పోస్టర్ లను రిలీజ్ చేస్తు వచ్చిన ఈ యూనిట్ తాజాగా ఈ రోజు  సినిమా టీజర్ ఎప్పుడు విడుదల చేసేదీ  ప్రకటించింది.  ఈ సినిమా టీజర్ ను నవంబర్ 22వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది ఈ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించింది. 

More Related Stories