English   

అర్జున్ సురవరం ట్రైలర్ టాక్

arjun
2019-11-19 21:07:13

టాలీవుడ్ కుర్ర హీరోలందరూ సక్సెస్ కోసం మొహం వాచి ఉన్నారు. వారిలో నిఖిల్ సిద్దార్థ్ ముందు వరుసలో ఉన్నాడు. కేశవ సినిమా తర్వత నిఖిల్ సక్సెస్ అందుకోలేదు. కిర్రాక్ పార్టీ డిజాస్టర్ అవ్వడంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అర్జున్ సురవరం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడాది ప్రధమార్ధంలో హల్ చల్ చేసిన ముద్ర సినిమా టైటిల్ విదాడంలో పడి అర్జున్ సురవరం అయింది. అక్కడితో ఆగక ఆర్ధిక ఇబ్బందుల్లో పడి సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడు బాలారిష్టాలు అన్నీ తొలగగా ఈ సినిమా ఈ నెల 29 రిలీజ్ కి సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రయిలర్ ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ అర్జున్ సురవరంగా నటించగా ఈ సినిమా దొంగ సర్టిఫికేట్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది.

ట్రైలర్‌లో చూపించిన సీన్స్ ఈ సినిమాలో హీరో పెద్ద ఇన్వెస్ట్ఇగేటివ్ జర్నలిస్ట్ అని చెప్పేస్తున్నాయి. ఈ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’ కి రీమేక్. సంతోష్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. బి. మధు సమర్పణలో మూవీస్ డైనమిక్స్ ఎల్ఎల్పీ &ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై రాజ్ కుమార్ ఆకేళ్ల , కావ్య వేణుగోపాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ సినిమా కోసం చాలా కష్టపడినట్లు నిఖిల్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు పడిన కష్టాలు నా 17 సినిమాలకు పడలేదు. హానెస్ట్ ఫిల్మ్ ని మీ దగ్గరికి తీసుకురావాలన్న ప్రయత్నమే ఇది. అర్జున్ సురవరం ట్రైలర్ నచ్చితే అందరికి షేర్ చేయండి అని నిఖిల్ పేర్కొన్నారు.

 

 

More Related Stories