English   

అక్కినేని అవార్డ్ ఫంక్షన్ కు సమంత ఎందుకు రాలేదు..

sam
2019-11-20 05:23:59

అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డు అంటే కుటుంబ ఫంక్షన్. ఏఎన్ఆర్ ఫ్యామిలీకి ఇది ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. దేశంలోని లెజెండరీ సినిమా సెలబ్రిటీలను ఎంచుకొని ప్రతి సంవత్సరం వాళ్లకు ఏఎన్నార్ జాతీయ అవార్డు ఇస్తున్నారు. ఈ సారి కూడా 2018 సంవత్సరానికి శ్రీదేవి.. 2019కి రేఖను ఎంచుకొని చిరంజీవి చేతుల మీదుగా వాళ్లకు అవార్డు ఇచ్చారు. అయితే అక్కినేని అవార్డు వేడుకకు కుటుంబ సభ్యులంతా హాజరైన కూడా సమంత అక్కినేని మాత్రం రాలేదు. ఒక్క కోడలు తప్ప ఇంటి సభ్యులు అంతా ఈ అవార్డు వేడుకకు హాజరయ్యారు. దాంతో అందరి కళ్ళు సమంత ఎక్కడ అనే దానిపైనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, బోనీ కపూర్ సాహో తెలుగు సినిమా దర్శక నిర్మాతలు హీరోలు చాలామంది ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఎంతమంది వచ్చినా కూడా అక్కినేని కుటుంబంలో అతి ముఖ్యమైన సమంత రాకపోవడంతో అభిమానులు నిరాశ పడ్డారు. దాంతో ఆమె తన కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అని పరిశ్రమ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో సమంత ఈ ఫంక్షన్ కి డుమ్మా కొట్టి అక్కినేని ఫ్యామిలీ పరువు మంట కలిపింది అని ట్రోల్ చేస్తున్నారు. నాగార్జునతో పాటు అతని సోదరీమణులు..

పిల్లలు మరియు సహా అక్కినేని కుటుంబం అవార్డుల వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. రేఖ, బోనీ కపూర్ అవార్డులు అందుకుని తమ ఉనికిని చాటుకున్నారు. కానీ సమంత రాకపోవడం మొత్తం లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని సమంత ఈ వేడుకకు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు అక్కినేని కుటుంబ సభ్యులు. ప్రస్తుతం 96 తెలుగు రీమేక్ తో బిజీగా ఉంది.. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు రావడంతో ఆమె అక్కడ తన పాత్ర చిత్రీకరణలో బిజీగా ఉంది. అందుకే అక్కినేని జాతీయ అవార్డుల వేడుకకు రాలేకపోయింది అంటున్నారు సభ్యులు. అంతేగాని ఆమెకు కుటుంబం మీద మర్యాద లేకపోవడం కానీ అక్కినేని పరువు తీయాలనే ఆలోచన కానీ లేదు అంటున్నారు అభిమానులు.

More Related Stories