English   

హన్సికకు మరో షాక్.. తెలుగు ఇండస్ట్రీ కలిసిరాదా..

Hansika
2019-11-20 10:31:09

ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసిన హన్సికకు ఇప్పుడు ఒక్క అవకాశం కూడా రావట్లేదు. అప్పుడెప్పుడో పూర్వకాలంలో మంచు విష్ణుతో నటించిన లక్కున్నోడు సినిమా ఈమెకు తెలుగులో చివరిది. ఆ సినిమా కూడా లక్కు తీసుకురాలేకపోయింది. దాంతో పూర్తిగా తెలుగు ఇండస్ట్రీ కి దూరమైపోయింది హన్సిక. ప్రస్తుతం తమిళనాట వరస సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే చాలా రోజుల తరువాత తెలుగులో మరో సినిమా చేసింది ఈ భామ‌. హీరో సందీప్ కిషన్ తో జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న తెనాలి రామకృష్ణలో ఈమె నటించింది. గతవారం విడుదలైన సినిమా డిజాస్టర్ అయ్యింది. తెలుగులో హన్సిక అనే ఓ హీరోయిన్ ఉంది అని గుర్తించుకోవాలి అంటే కచ్చితంగా తెనాలి రామకృష్ణ సినిమా ఏదో ఒక మాయ చేయాల్సిందే. మ‌రో ఆప్ష‌న్ కూడా లేదు. ఇలాంటి సమయంలో వచ్చిన తెనాలి రామకృష్ణ అత్యంత దారుణంగా ఫ్లాప్ కావడంతో హన్సిక తెలుగులో దాదాపు ముగిసినట్లే. కామెడీ హ్యాండిల్ చేయడంలో నాగేశ్వర్ రెడ్డి దిట్ట. అదే నమ్మకంతో తెనాలి రామకృష్ణ సినిమా చేసింది హన్సిక. కానీ అలాంటి మాయ ఏం జరగలేదు. దేనికైనా రెడీ సినిమాతో ఈమెకు మంచి విజయం అందించిన నాగేశ్వర్ రెడ్డి ఈసారి మాత్రం నిరాశనే మిగిల్చాడు.

More Related Stories