English   

ఆ ఫ్లాప్ దర్శకులకు ఇది బంగారం లాంటి అవకాశం..

Tollywood
2019-11-20 10:54:32

ఫ్లాప్ ఇచ్చిన దర్శకులను సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలు నిర్మాతలు అంత సులువుగా నమ్మరు. దానికి తోడు వరుస ఫ్లాపులు ఇస్తే అసలు పట్టించుకోరు. తెలుగు ఇండస్ట్రీలో ఇపుడు అలాంటి దర్శకులు కొందరున్నారు. కొన్నేళ్లుగా హిట్ అనే మాట మరచిపోయి పూర్తిగా ఖాళీ అయిపోయిన ఆ దర్శకులకు అనుకోకుండా ఇప్పుడు బంగారం లాంటి అవకాశాలు వచ్చాయి. తమను తాము నిరూపించుకోవడానికి ఆ దర్శకులు ఇంతకంటే అద్భుతమైన అవకాశం మరొకటి ఉండదు. అందులో మొదటి వాడు బొమ్మరిల్లు భాస్కర్.. 

తొలి సినిమా బొమ్మరిల్లు తర్వాత పరుగుతో పర్లేదు అనిపించిన ఈయన ఆరెంజ్ నుంచి ఫ్లాపుల బాట పట్టాడు. రామ్ చరణ్ కు తొలి ఫ్లాప్ ఇచ్చిన  ఈ దర్శకుడు ఆ వెంటనే రామ్ కు ఒంగోలుగిత్త అంటూ డిజాస్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత బెంగళూరు డేస్ సినిమా తమిళంలో రీమేక్ చేసి మరో డిజాస్టర్ ఇచ్చాడు బొమ్మరిల్లు భాస్కర్. మూడేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ దర్శకుడు ఇప్పుడు అఖిల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మాతలు కావడంతో సినిమాపై నమ్మకాలు బాగానే ఉన్నాయి. ఈయన తర్వాత వరస ఫ్లాపుల్లో ఉండి తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న మరో దర్శకుడు కృష్ణవంశీ. 

ఒకప్పుడు క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈ మధ్య వరుస ఫ్లాపులతో పూర్తిగా వెనుకబడి పోయాడు. అసలు నక్షత్రం అనే ఒక సినిమా వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ప్రస్తుతం రంగ మార్తాండ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈయనకు కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత విజయం లేదు. ముకుంద అంచనాలు తప్పగా.. బ్రహ్మోత్సవం సినిమా అయితే దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు శ్రీకాంత్ అడ్డాల వైపు ఎవరూ చూడలేదు. ఇలాంటి సమయంలో వెంకటేష్ హీరోగా అసురన్ సినిమా రీమేక్ బాధ్యతలు శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. 

ఈ ముగ్గురు దర్శకులకు ఇప్పుడు ఇంతకంటే అద్భుతమైన అవకాశాలు మరొకటి రాదు. వాళ్ళని వాళ్ళు నిరూపించుకుని ఇండస్ట్రీలో మరికొన్ని రోజులు ఉండాలంటే ఈ సినిమా కచ్చితంగా విజయం అందుకోవాల్సిందే.

More Related Stories