English   

బాలయ్య బోయపాటి సినిమా లాంచ్ ఆరోజునే 

Balakrishna
2019-11-20 14:20:49

గతేడాది బాలయ్య రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన తండ్రి జీవితాన్నే బయోపిక్ గా సొంతగా నిర్మించిన ఆయన దానిని రెండు భాగాలుగా రిలీజ్ చేసారు. కానీ అనుకున్నంత సక్సెస్ అయితే అందలేదు. అయితే సినిమాలు చేసుకుంటూ పోవడమే తప్ప విజయాల గురించి ఆలోచించని ఆయన ప్ర‌స్తుతం కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూల‌ర్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రిస్మ‌స్‌ కి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ మూవీ త‌ర్వాత బాల‌య్య‌ తనకి అభిమాని అయిన అచ్చొచ్చిన బోయ‌పాటితో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఈ సినిమా మీద భారీ అంచ‌నాలు ఉన్నాయి. నిజానికి ఆయన రూలర్ కంటే ముందే బోయపాటితో సినిమా చేయాల్సి ఉందిం కానీ బోయపాటికి వినయ విధేయ రామ దెబ్బ బాలయ్యకి బయోపిక్ దెబ్బ తగలడంతో సైలెంట్ అయ్యారు. 

ఇక బోయ‌పాటి తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర వార్తలు హల్చల్ చేస్తున్నాయి, అందుకో నిజం ఎంతుందో తెలియదు కానీ ఈ సినిమా గురించిన కొన్ని పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తున్న సమాచారం ప్రకార్ ఈ సినిమా వచ్చే నెలలో మొదలు కాబోతోంది. వచ్చే నెల డిసెంబర్ లో రూలర్ రిలీజ్ కి ముందే అంటే ఆ నెల 9వ తారీఖున ఈ సినిమా లాంచ్ చేయ బోతున్నారట. ఇక ఈ  సినిమా ద్వారా బాలీవుడ్ హీరోను బోయపాటి విలన్‌గా పరిచయం చేయబోతున్నారని అంటున్నారు.  బాల‌య్య‌కి విల‌న్‌గా బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్‌ని ఎంపిక చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. ఆయ‌న‌తో సంప్ర‌దింపులు కూడా మొద‌లు పెట్టార‌నేది టాక్. బోయపాటి తో జయ జానకి నాయక నిర్మించి కార్తికేయ 90 ఎం ఎల్ నిర్మించడం మొదలెట్టి బడ్జెట్ పెరగడం వలన తప్పుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. 

More Related Stories