English   

హైదరాబాద్ రౌడీలని కూడా వదలని వర్మ

Ram Gopal Varma
2019-11-20 14:36:54

వివాదాస్పద దర్శకుడు వర్మ ఏమి చేసిన వివాదమే. ప్రస్తుతం వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మొన్న జరిగిన ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నానన్న వర్మ తన గత సినిమా లక్ష్మీస్ ఎన్ఠీఆర్ సినిమాని రిలీక్ కాకుండా ఆపారన్న కోపమో ఏమో కానీ ఆ చంద్రబాబు లోకేష్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

గతంలో వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వంగవీటి సినిమాలో వంగవీటి రంగా పాత్రలో నటించిన సందీప్‌ మాధవ్ తాజాగా లీడ్ రోల్ లో నటించిన జార్జ్‌ రెడ్డి సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో వివాదం మొదలైంది. ఈ క్రమంలో ఈ వివాదాస్పద దర్శకుడు తన శిష్యుడి సినిమాకి తన మద్దతు తెలిపాడు. పవన్ చేయాలనుకున్నాడు అనే ఒకరకమైన ప్రచారంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్‌ ఏర్పడింది. 

తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లోకి వర్మ ఎంటర్‌ అయ్యి ఈ సినిమా ట్రైలర్ ని ట్వీట్ చేయి కు సంబంధించి ట్వీట్ చేశాడు వర్మ. `జార్జ్‌ రెడ్డి మళ్లీ బతికి వచ్చినట్టుగా థ్రిల్‌ చేస్తోంది ఈ సినిమా, సందీప్‌ సూపర్బ్‌గా నటించాడు. దర్శకుడు జీవన్‌ రెడ్డితో పాటు సినిమాను రిలీజ్‌ చేస్తున్న అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థలకు శుభాకాంక్షలు` అంటూ ట్వీట్ చేశాడు వర్మ. అక్కడితో ఆగని వర్మ జార్జ్‌ రెడ్డి సినిమాలో టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న సందీప్‌ మాధవ్‌ను తన నెక్ట్స్‌ సినిమా కోసం తీసుకున్నట్టుగా ప్రకటించాడు.

 `విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టుల కథలను తెరకెక్కించిన తరువాత త్వరలో 80లలో హైదరాబాద్‌లోని దాదాల నేపథ్యంలో ఓ సినిమాను రూపొందిస్తున్నాను. శివ సినిమాకు నాకు ప్రేరణ ఇచ్చిన ఓ నిజజీవిత పాత్ర ఇన్సిపిరేషన్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నానని చెబుతూ ట్వీట్ చేశాడు వర్మ. దీంతో వర్మ హైదరాబాద్  మీద పడ్డాడా అని అనుకుంటున్నారు జనాలు.

More Related Stories