English   

అల్లు అర్జున్ కోసం సాయి తేజ్ కు అల్లు అరవింద్ అన్యాయం..

Sai Dharam Tej
2019-11-20 15:31:01

అల్లు అరవింద్ చిన్న సినిమాలతో పాటు ఒకేసారి పెద్ద సినిమాలను కూడా నిర్మిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. కొడుకు అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురంలో లాంటి ఒక భారీ బడ్జెట్ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు నిర్మిస్తున్నాడు ఈ మెగా నిర్మాత. ఈ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో ప్రతి రోజు పండగే సినిమా కూడా నిర్మిస్తున్నాడు అల్లు అరవింద్. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. అంటే మరో నెలరోజుల్లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట. కానీ ప్రమోషన్స్ మాత్రం అనుకున్నంత వేగంగా జరగడం లేదు. 

ఈ విషయంలో మెగా మేనల్లుడు అసహనంతో ఉన్నాడని తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల కానున్న అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా ప్రమోషన్ పనులపై అల్లు అరవింద్ ఎక్కువ దృష్టి పెడుతున్నాడని.. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదు అంటూ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే అందులో నిజం కూడా లేకపోలేదు. బన్నీ సినిమాపై అంచనాలు పెంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అల్లు అరవింద్. 

అదే సమయంలో మరో నెల రోజుల్లో విడుదల కానున్న ప్రతి రోజు పండగే సినిమాపై మాత్రం పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని ప్రచారం జరుగుతుంది. సామజవరగమన, రాములో రాముల పాటలు అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కానీ ప్రతి రోజు పండగే సినిమా టైటిల్ సాంగ్.. మొన్న విడుదలైన ఓ బావ పాటలకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. తన సినిమాకు కూడా లైవ్ ఆర్కెస్ట్రా టైపులో విడుదల చేస్తే బాగుండేదని సాయి భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ అల్లు అర్జున్ కు ఇచ్చిన ప్రాముఖ్యత తన సినిమాకు ఇవ్వడం లేదు అంటూ మెగా మేనల్లుడు బాగానే ఫీల్ అవుతున్నాడు. మరి రానున్న రోజుల్లో ప్రతి రోజు పండగే ప్రమోషన్స్ మరింత పెంచుతారేమో చూడాలి.

More Related Stories