అనసూయ అవుట్...రాములమ్మ ఇన్

బుల్లితెర ప్రేక్షకులను తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఆకట్టుకున్న షో జబర్దస్త్. సుమారు ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కామెడీ షో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. జబర్దస్త్ క్లిక్ కావడంతో.. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రెండు షో లు గురు, శుక్రవారాల్లో ఈ షోలు ఈటీవీలో ప్రసారమవుతున్నాయి. గత వారం రోజులుగా జబర్దస్త్ షో గురించి రకరకాలుగా వార్తల్లోనే ఉంది. ఈ షో ఆగిపోతుందని లేదు టీం లీడర్స్ అంతా వెళ్లిపోయి కొత్త వాళ్లు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ కామెడీ షోకి ధీటుగా జీ తెలుగు ‘గ్యాంగ్ స్టార్స్’ అనే ప్రోగ్రామ్‌ను భారీ ఎత్తున ప్రారంభించనుంది. అయితే ఈ షో కోసం జబర్దస్త్ యాంకర్ అనసూయతో పాటు.. జడ్జ్ నాగబాబు, హైపర్ ఆదిలను సైతం ఇప్పటికే తీసేసుకుందట జీ తెలుగు.
వీరితో పాటుగా సుడిగాలి సుధీర్, ప్రదీప్‌లను జీ తెలుగు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకువస్తున్నారు. రవి, సుధీర్, హైపర్ ఆది ముగ్గురూ ఈ షోకు హోస్ట్ చేయబోతున్నారని అంటున్నారు. ఇక అనసూయను కూడా ఈ షోకి యాంకర్‌గా రంగంలోకి దించబోతున్నారట. ‘జబర్దస్త్’ షోను ఇంతకాలం నితిన్-భరత్‌లు డైరెక్ట్ చేశారు. అయితే, తాజాగా వారికి ప్రొడక్షన్ హౌస్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్తో విభేదాలు రావడంతో షో నుంచి తప్పుకున్నారు. వారి వలెనే ఈ రచ్చ అంతా అని అంటున్నారు. అనసూయ జబర్దస్త్ నుండి బయటకి రాగానే ఆమె స్థానంలో శ్రీముఖి రంగంలోకి దించబోతున్నారట. అయితే గతంలో ఈటీవీ ‘పటాస్’ షో నుండి అర్ధాంతరంగా తప్పుకుని స్టార్ మా బిగ్ బాస్‌కి వెళ్లిన శ్రీముఖిని మళ్లీ ఈటీవీలోకి తీసుకురావడం అంటే అనుమానమే.