English   

అమెజాన్‌ ప్రైమ్‌లో సైరా నరసింహారెడ్డి 

Sye Raa On Amazon Prime
2019-11-21 11:53:27

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ సినిమా సైరా నరసింహారెడ్డి. చిరు తనయుడు రామ్‌ చరణ్‌ నిర్మించిన ఈ సినిమాని సురేందర్‌ రెడ్డి తెరకెక్కించాడు. తెలుగు నుండి తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా మహాత్మ గాంధీ 150వ జయంతి కానుకగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాస్టార్‌ సత్తా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్‌చేసిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కానుంది. అదేనండీ ఈ సినిమాని డిజిటల్ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేశారు. ఇక నిమా రిలీజ్‌ అయిన 50 రోజుల్లోనే అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా సైరా సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా అభిమానుల కోసం అమెజాన్‌ ప్రైమ్‌ గిఫ్ట్ ఇచ్చింది. సైరా నరసింహారెడ్డి సినిమా నేటి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నేడు విడుదలవుతుండగా హిందీ వర్షన్‌ మాత్రం ఈ నెల 28న విడుదల కానుంది. నిజానికి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించినా ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆ స్థాయిలో వర్క్‌ అవుట్ కాలేదు. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. బాహుబలి స్థాయిలో బజ్‌ క్రియేట్‌ చేస్తుందని ఆశించినా సైరా నరసింహారెడ్డి ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. 

More Related Stories