రూలర్ టీజర్ విడుదల.. బాలయ్య ఉగ్రరూపం..

బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయాడు. జై సింహా సినిమాతో బాక్సాఫీస్ షేక్ చేసిన కేయస్ రవికుమార్‌తో కలిసి ఈయన మరోసారి వస్తున్నాడు. దానికి రూలర్ అనే పవర్ ఫుల్ టైటిల్ కూడా పెట్టారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్.. పోస్టర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు టీజర్‌తో వచ్చాడు నందమూరి హీరో. బాలయ్యను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు కేయస్ రవికుమార్. ముఖ్యంగా ఆయన గెటప్‌కు ఫ్యాన్స్ నుంచి కిరాక్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు టీజర్లో కూడా ఈ గెటప్ హైలైట్ అయింది. మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు ఈ సీనియర్ హీరో. రూలర్ టీజర్ అంతా బాలయ్య ప్రధానంగానే సాగింది. ఆయనపైనే ఫోకస్ చేసాడు దర్శకుడు. మనం బాలయ్యను బాగా చూసుకుంటే చాలు..
ఆయనే ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను చూసుకుంటాడులే అనే ధైర్యం కేయస్ రవికుమార్‌లో కనిపిస్తుంది. అందుకే కాబోలు బాలయ్యపైనే టీజర్ అంతా కట్ చేసాడు రవికుమార్. ఈ చిత్రం టీజర్ చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో కూడా క్లారిటీ వచ్చేసింది. ఒంటిమీక ఖాకీ డ్రస్ ఉన్నపుడే బోన్లో పెట్టిన సింహాన్ని.. ఒక్కసారి అది తీసేస్తే బయటికి వచ్చిన సింహాన్ని.. ఇక వేటే అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. కచ్చితంగా మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడానికి సిద్ధమైపోతున్నాడు బాలయ్య. ఎన్టీఆర్ బయోపిక్ దారుణంగా నిరాశ పరచడంతో ఇప్పుడు ఈయన ఆశలన్నీ రూలర్ సినిమాపైనే ఉన్నాయి. తక్కువ టైమ్‌లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు కేయస్ రవికుమార్. మరోసారి జై సింహా కాంబినేషన్లోనే సినిమా వస్తుంది. సోనాల్ చౌహాన్, వేదిక ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు. ప్రతిరోజూ పండగే సినిమాతో పాటు రవితేజ డిస్కో రాజాతో బాలయ్య పోటీ పడబోతున్నాడు.