English   

వర్మకి షాకిచ్చిన పాల్

paul
2019-11-22 01:34:55

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌ తోనే బోలెడు మార్కెటింగ్ చేసుకున్నాడు. ఈ సినిమా పేరు ఒక కులం వాళ్లను కించ పరిచేలా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తగా ఎవరో ఒకరు ఈ సినిమా మీద కేసు వేస్తారని అనుకున్నారు. అనుకున్నట్టే ఈ సినిమా విడుదలను ఆపాలని క్రైస్తవ మత బోధకుడు.. ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడని  కేఏ పాల్ ఆరోపించారు.

అంతేకాదు ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమాను నిలుపుదల చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో కేంద్ర సమాచార శాఖ, సెన్సార్ బోర్డ్‌, , రామ్ గోపాల్ వర్మ, జబర్దస్త్ కమేడియన్ రాము తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. పాల్ పిటిషన్ పై నేటి మధ్యాహ్నం తరువాత హైకోర్టులో విచారణ జరుగనుందని సమాచారం. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ ఇప్పటికే విడుదలయ్యాయి .వాటిలో కేఏ పాల్ ను జాఫర్ ఇంటర్వ్యూ చేస్తున్నట్లు గా ఉన్న సీన్ అలాగే ఆయన మీద ఒక పేరడీ సాంగ్ లు రిలీజ్ చేసిన నేపథ్యంలో, సినిమాలో తన అనుమతి లేకుండా తనను టార్గెట్ చేసిన కారణంగా పాల్ హైకోర్టును ఆశ్రయించారు.

More Related Stories