English   

షాకింగ్.. సంక్రాంతి హీరోలతో త్రివిక్రమ్ ప్రత్యేక ఇంటర్వ్యూ..

tri
2019-11-21 18:48:42

2020 సంక్రాంతి బరిలో ఇద్దరు స్టార్ హీరోలున్నారు. ఓ వైపు మహేష్ బాబు, మరోవైపు బన్నీ దూసుకుపోతున్నారు. సై అంటే సై అంటున్నారు. ఈ ఇద్దరూ పందెంకోళ్లలా బరిలో దిగుతున్నారు. ఓ వైపు మహేష్ సరిలేరు నీకెవ్వరు.. మరోవైపు బన్నీ అల వైకుంఠపురములో సినిమాలు ఒకేరోజు రానున్నాయంటూ నిర్మాతలు చెబుతున్నారు. చివరి వరకు రిలీజ్ డేట్స్ మార్చుకుంటారులే అని ధైర్యంగా కనిపిస్తున్నారు బయ్యర్లు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు అభిమానులకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇద్దరు హీరోల సినిమాలు కలిసి ప్రమోట్ చేసుకునే విధంగా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంటే అటు మహేష్.. ఇటు బన్నీని కూర్చోబెట్టి ఈయన ఓ ఇంటర్వ్యూ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అలా చేస్తే రెండు సినిమాలకు కలిసొస్తుందనేది వాదన. అల వైకుంఠపురములో దర్శకుడు త్రివిక్రమే కాబట్టి ఎలాంటి అల్లు అర్జున్ తో సమస్య లేదు.. కానీ మహేష్ బాబును ఈ ఇంటర్వ్యూకి ఒప్పించాలి. ఆయన కూడా మంచి స్నేహితుడే కాబట్టి ఒప్పుకుంటాడనే అనుకుంటున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకవేళ బన్నీ, మహేష్ కలిసి ఇంటర్వ్యూ ఇస్తే మాత్రం అది సంచలనమే అవుతుంది. సంక్రాంతి స్పెషల్ ఇంటర్వ్యూగా చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పట్నుంచే దీనిపై వర్క్ మొదలు పెడుతున్నాడు మాటల మాంత్రికుడు.

More Related Stories