English   

జార్జి రెడ్డి సినిమా ప్రివ్యూ

george
2019-11-21 19:41:06

జార్జి రెడ్డి..! ఒకప్పటి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్‌ లీడర్‌ అయిన జార్జ్ రెడ్డి అనే వ్యక్తి జీవిత కధ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు ఈ సినిమా ఎలా ఉంది అనేది రిలీజ్ అయితే కానీ మనకు తెలియదు కానీ ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఒక్కసారిగా సినిమాపై ఆసక్తిని, అంచనాలను భయంకరంగా పెంచేసింది. జార్జి రెడ్డి అంటే ఈ తరం వారికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కానీ మన తండ్రుల తరం వారికి ఆయన సుపరిచితుడే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయనో విద్యార్ధి కాదు అంతకు మించిన ఉద్యమ నేత, ఎంతో మంది విద్యార్ధి నేతలకు ఆయన జీవితం ఆదర్శం. అతి చిన్న వయసులోనే కాలేజీలోనే కాలేజీ గొడవల్లో హతమయిన ఆయన వచ్చే నాటికి అది మ‌తోన్మాదుల, కులోన్మాదుల అర‌చ‌కాల‌కు అడ్డాగా ఉండేది. ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకునేవారు. అలాంటి సమయంలో ఈ రాజ‌కీయాల‌కు జార్జిరెడ్డి అడ్డుక‌ట్ట వేశాడు. ఏబీవీపీ నాయ‌కుల తీరును స‌వాల్ చేస్తూ విద్యార్థుల‌ను సంఘటితం చేసి ఈవ్ టీజింగ్‌, ర్యాగింగ్‌కి పాల్ప‌డే వారికి త‌గిన బుద్ధి చెప్పాడు.

ఆయన జీవిత కదా ఆధారంగా గతంలో ‘దళం’ సినిమాతో విబిన్నమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న జీవన్ ఈ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాలో వంగవీటి ఫేం సందీప్ మాధవ్ (సాండీ) జార్జ్ పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మనోజ్ నందం, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహతి హీరో సత్య దేవ్ నటించారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక జార్జి రెడ్డి తల్లి లీలా వర్ఘసీ పాత్ర పోషిస్తున్నారు. 1970ల బాక్ డ్రాప్ లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ సినిమాని మైక్ టీవీ అధినేత అప్పిరెడ్డి త్రీ లైన్స్ సినిమా బ్యానర్‌ తో కలిసి సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఒకప్పుడు పవన్ ఈ సినిమా చేయాలనుకున్నాడని వార్తలు బయటకి రావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఏమేరకు అంచనాలు అందుకుంటుందో రేపు తేలిపోనుంది.

More Related Stories