English   

కమల్ కి సర్జరీ...పాత గాయానికి మళ్ళీ

kamal
2019-11-22 05:31:22

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను ఇప్పుడు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే కమల్ హాసన్ ఓ శస్త్రచికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారని సమాచారం. ఈ విషయాన్ని ఆయన రాజకీయ పార్టీ మక్కల్ నీది మయం పార్టీ తరపున ఓ లేఖ ద్వారా తెలిపారు. కమల్ కు శుక్రవారం నాడు వైద్యులు శస్త్ర నిర్వహించనున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. 2016లో ఆయన ఓ ప్రమాదానికి గురికాగా, కాలులో ఇంప్లాంట్ ను డాక్టర్లు అమర్చారని ఇప్పుడు దాన్ని మరో సర్జరీ చేసి తీయనున్నారని.. ఆపరేషన్ తరువాత ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారని సదరు లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ శస్త్రచికిత్స గతంలోనే జరగాల్సి ఉండగా పార్టీ కార్యకలాపాల కారణంగా వాయిదా పడుతూ వచ్చిందని పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్ మహేంద్రన్ సదరు లేఖలో వెల్లడించారు.

More Related Stories