English   

బ్రహ్మాస్త్రలో నాగార్జున క్యారెక్టర్ అదేనా

nag
2019-11-22 05:41:04

భారీ బ్యాడ్జెట్ తో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్ర.  కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ కొంత కాలంగా శరవేగంగా జరుగుతోంది. బ్రహ్మాస్త్ర మూవీలో నాగార్జున ఆర్కియాలజిస్ట్ గా నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కధ ప్రకారం ఒక పురాతన ఆలయం పునరుద్ధరించడానికి తన స్టూడెంట్స్ తో నాగార్జున వారణాసి వెళతారు. ఈ నేపధ్యంలోనే వారణాసిలో కాశీ విశ్వనాథ్ టెంపుల్, ది చెట్ ఫోర్ట్ ప్రాంతాలలో నాగార్జున పై కొన్ని సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారని అంటున్నారు. ఓ సంఘటన హీరో హీరోయిన్లు ఇద్దరూ నాగార్జున దగ్గరకు వచ్చేలా చేస్తుందట. కథలో నాగార్జున పాత్ర కీలకమని తెలుస్తోంది. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే త్వరలో కొత్త దర్శకుడితో నాగార్జున సినిమా ప్రారంభం కానుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి దగ్గర కొన్నాళ్లగా పని చేస్తున్న అహిషోర్ సోలమన్ ను నాగార్జున దర్శకుడిగా పరిచయం చేయనున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా మొదలు కానుందని అంటున్నారు. 

More Related Stories