English   

ఆ పుస్తకం ఆధారంగా సినిమా రాజశేఖర్ డ్యుయల్ రోల్ 

Raj Sekhar
2019-11-22 12:03:41

విద్యావ్యవస్థలో లోపాలను, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని, వాళ్ళ ఆత్మహత్యలకు గల కారణాలను విశ్లేషిస్తూ ‘రిషి’, ‘ఆంధ్రాపోరి’ చిత్రాల దర్శకుడు రాజ్‌ మాదిరాజు రాసిన నవల సిరా. తాజాగా మొన్న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పుస్కకావిష్కరణ జరిగింది. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని యంగ్రీస్టార్‌ రాజశేఖర్‌కు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ అందజేశారు.  అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రం లో జరిగిన ఇంటర్మీడియెట్ స్టూడెంట్స్ ఆత్మహత్యల నేపథ్యంలోనే ఈ పుస్తకం ఉందట. అయితే తాజా అప్డేట్ ప్రకారం ఈ పుస్తకం సుపర్ హిట్ అవడంతో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాని ప్రసాద్ ల్యాబ్స్ అధినేత, నిర్మాత రమేష్ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో రాజ శేఖర్ హీరోగా రచయితగా ఉన్న రాజ్ మాదిరాజు దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. ఈ మూవీ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయని అంటున్నారు. ఈ మూవీలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం అది కూడా లాయర్, ప్రొఫెసర్ గా ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.  

More Related Stories