English   

నాగార్జున ఆ దర్శకులను ఇబ్బంది పెట్టాడా..

Nagarjuna
2019-11-22 12:11:37

తెలుగు ఇండస్ట్రీలో నాగార్జునకు మరో పేరు కూడా ఉంది.. సినీసైంటిస్ట్ అని. కొత్త కథలు, దర్శకులు ఎక్కడున్నా కూడా వెంటనే అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తుంటాడు ఈయన. ఇప్పుడు కూడా సోలోమెన్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు మన్మథుడు. అయితే ఈయనపై ఇప్పుడు షాకింగ్ రూమర్స్ బయటికి వస్తున్నాయి. సినిమా అనుకున్న ఫలితాలు రాకపోతే దర్శకులను నాగార్జున పేరు పెట్టి మరీ టార్గెట్ చేస్తాడనే విమర్శలున్నాయి. 

గతంలో కొందరు దర్శకుల విషయంలో అది జరిగింది కూడా. ఈ మధ్యే మన్మథుడు 2 సినిమా విషయంలోనూ నాగ్ చాలా డిసప్పాయింట్ అయ్యాడని.. ఈ సినిమా పరాజయానికి రాహుల్ రవీంద్రన్ ప్రధాన కారణం అని చెబుతున్నట్లు టాక్. అంతేకాదు.. అప్పట్లో భాయ్ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత దర్శకుడు వీరభద్ర చౌదరిని దారుణంగా విమర్శించాడు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు భాయ్ సినిమా అన్నాడు. దాంతో మనోడి కెరీర్ మటాష్. మన్మథుడు 2 సమయంలో కూడా రాహుల్ రవీంద్రన్ ని కూడా స్క్రిప్ట్ లో మార్పులు చేయించాడని తెలుస్తుంది. 

ఇక సోగ్గాడే చిన్నినాయనే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పరిస్థితి కూడా అలాగే ఉందని తెలుస్తుంది. ఈయన కూడా ఎటూ కదల్లేని పరిస్థితుల్లో అన్నపూర్ణలోనే ఉండిపోయాడు. ఇక శ్రీనివాస్ రెడ్డి సిచ్చువేషన్ కూడా ఇంచుమించు అంతే. అప్పటి వరకు ఏవో కామెడీ సినిమాలు చేసుకుంటున్న ఆయన్ని పిలిచి ఢమరుకం ఇచ్చాడు నాగార్జున. కానీ ఆ సినిమా ఆడలేదు.. ఆ తర్వాత కూడా హలో బ్రదర్ రీమేక్ అంటూ పది నెలలు వర్క్ చేయించి కాదన్నాడు.. దుర్గ సినిమా అంటూ నాగచైతన్యకు చెప్పి ఒప్పించి ఆ తర్వాత నో అనేసాడు. దాంతో ఆయన కెరీర్ పాడైపోయింది. ఇప్పుడు మళ్లీ రాగల 24 గంటల్లో అంటూ వస్తున్నాడు. మొత్తానికి దర్శకుల విషయంలో నాగార్జున తన తీరు మార్చుకోవాలంటున్నారు విశ్లేషకులు. 

More Related Stories