English   

ఆ వారసుడిపై నోరు పారేసుకున్న తాప్సీ.. ఫ్యాన్స్ ఫైర్.. 

Taapsee Pannu
2019-11-22 12:18:35

ఇండస్ట్రీలో వారసత్వం కామన్. ఇక్కడ వాళ్లదే రాజ్యం కూడా. ఏ ఇండస్ట్రీ అయినా కూడా తాత నుంచి మనవళ్ల వరకు పాతుకుపోయారు. నెక్ట్స్ జనరేషన్స్ కూడా వస్తాయి. వాళ్లకు నటన వచ్చినా రాకపోయినా కూడా ప్రేక్షకులకు వారసులను అలవాటు చేస్తారంతే.. ఆప్షన్ లేదన్నట్లు ఆడియన్స్ కూడా చూస్తారంతే. అగ్ర హీరోలు తమ వారసులను సినిమా ప్రపంచంలోకి దించేస్తున్నారు. వాళ్ల చదువు అయిపోగానే.. కొందరు అయితే కనీసం చదువు కూడా పూర్తి కాకుండానే తమ వారసులను తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితిపై ఈ మధ్యే హీరోయిన్ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టార్ కిడ్ కాకపోయి ఉంటే ఏ హీరోకు అసలు కెరీర్ ఉండేది కాదని ఆమెను ఓ ప్రశ్న అడిగారు. దానికి మరో ఆలోచన లేకుండా ఓ బాలీవుడ్ స్టార్ హీరో తనయుడిపై వ్యాఖ్యలు చేసింది తాప్సీ. ఇదంతా నో ఫిల్టర్ నేహా అనే ఛాట్ షోలో జరిగింది. ఏ హీరో కొడుకు గురించి తాప్సీ చెప్పిందో తెలుసా.. అనిల్ కపూర్ కొడుకు హర్షవర్థన్ కపూర్ గురించి మాట్లాడింది తాప్సీ. హర్షవర్ధన్ కపూర్ విషయంలో తాను ఇలా అనుకుంటున్నట్లు చెప్పింది. ఈయన తొలి సినిమా అట్టర్ ఫ్లాప్.. అయినా కూడా రెండో సినిమా వచ్చింది. అతడు కానీ అనిల్ కపూర్ కొడుకు కాకపోయుంటే వచ్చేదా అంటుంది తాప్సీ. అదే స్థానంలో తానుంటే అలా జరిగేది కాదు కదా.. పూర్తిగా కెరీర్ అయిపోయేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇంతమంది ఉండగా హర్షవర్థన్ కపూర్‌నే ఆమె ఎందుకు టార్గెట్ చేసిందో అర్థం కావడం లేదు. 

More Related Stories