English   

రకుల్ ప్రీత్ సింగ్‌ను ఆ హీరో కొట్టాడా.. ఇంతకీ ఎవరాయన..

Rakul Preet Singh
2019-11-22 12:26:45

రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య బాగా బిజీ అయిపోయింది. బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయి అక్కడే బోల్డ్ గా బోలెడు ఇంటర్వ్యూలు ఇష్తుంది. ఈ మధ్య ఈమె చెబుతున్న కొన్ని మాటలు సంచలనాలు రేపుతున్నాయి. మొన్నటికి మొన్న తనను ఓ స్టార్ హీరో సెక్స్ కోసం అడిగాడని చెప్పి సంచలనం రేపింది. ఇక ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో తనను ఓ కోస్టార్ కొట్టాడని చెబుతుంది. ఇంతకీ ఎవరాయన అంటే మాత్రం సైలెన్స్. అంతేకాదు.. తన రహస్య ప్రేమికుడి గురించి కూడా చెప్పింది రకుల్. కాకపోతే ఇక్కడ కూడా పేరు చెప్పలేదు. కాకపోతే ఉన్నాడా లేదా అనేది మాత్రం రివీల్ చేయకుండా దాచేసింది. యారియాన్ సినిమా టైమ్ లో ఆ సినిమా హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో రకుల్ ప్రేమలో పడిందనే వార్తలొచ్చాయి. అయితే ఈ హీరోకు బాలీవుడ్ నిండా గాళ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో తనను కూడా కలిపేసారంటుంది రకుల్. ఈ హీరోతోనే ఇప్పుడు మర్జావాన్ సినిమాలో నటించింది. ఇందులో సిద్ధార్థ్ ని ప్రేమించే అమ్మాయిగా నటించింది రకుల్. మీ కో స్టార్స్ లో ఎవరినీ మీరు ప్రేమించలేదా అంటే ఆ ఛాన్స్ లేదనేసింది. తెలుగులో హీరోలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి కదా.. అవకాశం లేకుండా పోయింది అంటుంది రకుల్. రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. అలాంటప్పుడు కుదరదు కదా అంటూ కొంటె సమాధానం చెప్పింది ఈమె. మరి రానాతో ఎఫైర్ ఉందటగా అంటే మాత్రం ఫ్రెండ్ అంటూ నవ్వేసింది రకుల్. 

More Related Stories