ఎద మీద రాముడి పేరు...నాని హీరోయిన్ మీద కేసు

హీరో నానితో కలిసి ‘ఆహా కల్యాణం’లో సందడి చేసిన బాలీవుడ్ కథానాయిక వాణీ కపూర్ గుర్తుండే ఉంటుంది. అయితే ఆమె చేసిన ఒక పని వివాదానికి కారణం అయింది అక్కడితో ఆగక ఇప్పుడు ఆమె మీద కేసు కూడా నమోదయ్యింది. ఇటీవల ఆమె వేసుకున్న దుస్తులు తమ మత సాంప్రదాయాలను, మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ముంబైలో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు ఎమ్ఎన్ జోసీ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల ఆమె వేసుకున్న దుస్తులతో వార్తల్లో నిలిచింది.
వాణీ ‘హే రామ్’ అంటూ రాసిన టాప్ జాకెట్ బికిని ధరించిన ఫోటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అది చూసిన నెటిజన్లు చాలా తీవ్రమైన పదాలతో వాణీపై విరుచుకుపడ్డారు. ఆమె మీద నెగటివ్ రాగానే ట్విట్టర్లో తొలిగించినా అప్పటికే ఈ ఫోటో వైరల్ అయ్యింది. వాణీ ఈమధ్యనే హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి ‘వార్’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో వస్తున్న ‘షమ్షేరా’లో వాణీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇది 1800 శతాబ్దానికి చెందిన బ్రిటీష్ వారిని ఎదిరించే బందిపోటు తెగకు చెందిన రియల్ స్టోరీ.