English   

అల్లు అర్జున్, మహేష్ బాబు కాంప్రమైజ్.. సంక్రాంతి కొత్త రిలీజ్ డేట్స్..

mb
2019-11-22 18:42:14

ముందు నుంచి కూడా చాలా రోజులుగా సంక్రాంతి సినిమాలపై ఇండస్ట్రీలో చాలా చర్చ జరుగుతుంది. విడుదల తేదీ విషయంలో బన్నీ, మహేష్ పోటీ పడుతున్నారు. మరో డేట్ లేనట్లు ఇద్దరూ వచ్చి జనవరి 12నే ఎంచుకున్నారు. దాంతో బయ్యర్లు కూడా చాలా భయపడుతున్నారు. ఓ వైపు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న అల వైకుంఠపురములో.. మరోవైపు మహేష్ బాబు, అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమాలపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఒకేరోజు వస్తామని చెప్పడంతో వాళ్ల మధ్య సయోధ్య కుదర్చడానికి నిర్మాతలు కూడా ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు కుదర్లేదు.

అయితే ఇప్పుడు కూర్చుని మాట్లాడుకుని తమ సినిమాల విడుదల తేదీలు మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసారు దర్శక నిర్మాతలు. ముందు నుంచి చెబుతున్నట్లుగానే మహేష్ బాబు ఒకరోజు ముందుకు వచ్చాడు. ఈయన సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న విడుదల కానుంది. ఇక అనుకున్నట్లుగానే జనవరి 12న బన్నీ వస్తున్నాడు. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు.. 12న అల వైకుంఠపురములో సినిమాలు రానుండటం.. మధ్యలో ఓ రోజు గ్యాప్ ఉండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు బయ్యర్లు. మరోవైపు టాక్ బాగుంటే సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా లాభమే. మరి చూడాలిక.. ఈ మారిన విడుదల తేదీలతో బన్నీ, మహేష్ ఎలాంటి మాయ చేయబోతున్నారో..?

More Related Stories