సాహో డైరెక్టర్ కి కీలక పదవి కట్టబెట్టిన జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక పదవి భర్తీ పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో అనేక మంది సినీ ప్రముఖులు జగన్ కు మద్దతుగా రంగంలోకి దిగారు. నిజానికి వారెవరూ గతంలో కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత వారు అంత యాక్టివ్ గా కనిపించటం లేదు. ఇదే సమయంలో పార్టీలో తొలి నుంది ఉన్న వారికి పదవుల కేటాయింపులో వరుసగా నిర్ణయాలు తీసుకుంటున్న జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకు న్నారు. అందులో భాగంగా..లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమి ఛైర్మన్ పదవి కట్టబెట్టిన ముఖ్యమంత్రి మొన్న ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని సీనియర్ యాక్టర్ విజయ్ చందర్ కు ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ పదవి కోసం అనేక మంది పేర్లు వినిపించినా పార్టీ ఏర్పాటు నుండి తనతోనే ఉన్న విజయ్ చందర్ కు ఈ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అయితే ఆయన ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని బయట పెట్టారు. అదేంటంటే ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ డిరెక్టర్ గా సాహో సినిమాని తెరకెక్కించిన సుజీత్ ని నియమించినట్టు సమాచారం. కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టాడాయన. అయితే తండ్రి చార్టెడ్ అకౌంటెంట్ కావడంతో ఆయనకు వారసునిగా మరో చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకున్న ఆయన అనూహ్యంగా సినీ రంగంవైపు మళ్లీ హాలీవుడ్ స్థాయిలో సాహో సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆయన పూర్తి పేరు ఎద్దుల సుజీత్ రెడ్డి.