English   

చైతూ సినిమా టైటిల్ అదేనా

nag
2019-11-23 07:24:14

హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి యూత్ ఫుల్  సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల ఇప్పుడు  అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూట్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇది డ్యాన్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో నడిచే ప్రేమకథ అని చెబుతున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవిలలో ఒకరు పిల్లలకి డ్యాన్స్ నేర్పించే పాత్రలో నటించనున్నారని మరొకరు వారిని చూసి ప్రేమలో పడతారని అంటున్నారు.

ఈ చిత్రంలో నాగ చైతన్య పాత్రను పరిచయం చేసేలా ఒక వీడియోను ఈరోజు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇక  ఈ సినిమాకు ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అంతేకాక ఈ సినిమాని ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల రోజున రిలీజ్ చేయచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కావడంతో ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేయడం మంచిదని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం. ఇక నాగ చైత్యన్య, వెంకటేష్ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ వెంకీమామ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఈ సినిమాను వెంకటేష్‌ పుట్టిన రోజు కానకగా డిసెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.  

 

More Related Stories