English   

జబర్దస్త్ కామెడీ షో కిరాక్ ఆర్పీ సెటైర్లు.. నెటిజన్ల వార్నింగ్..

rp
2019-11-23 07:37:35

మనం ఎంత ఎదిగినా కూడా ఎక్కడి నుంచి వచ్చాము అనే సంగతి మాత్రం మర్చిపోకూడదు. పునాదులు మరిచిపోతే పుట్టగతులు ఉండవు అంటారు పెద్దలు. అయితే ఇప్పుడు కొందరు జబర్దస్త్ కమెడియన్స్ ఈటీవీ నుంచి మరో చానల్ కు వచ్చారు. జబర్దస్త్ ను అనుకరిస్తూ జీ తెలుగులో కూడా అతి పెద్ద కామెడీ షో ప్లాన్ చేస్తున్నారు. అందులోకి చమ్మక్ చంద్ర, కిరాక్ rp జబర్దస్త్ నుంచి వచ్చారు. వాళ్లతో పాటు వేణు వండర్స్ కూడా మరోసారి ఇందులో కనిపిస్తున్నాడు. ఇక జబర్దస్త్ నుంచి నాగబాబు కూడా వచ్చేశాడు. ఇదంతా ఇలా ఉంటే కొత్త షోలో తనకు లైఫ్ ఇచ్చిన పాత షోపై సెటైర్లు వేశాడు కిరాక్ rp. ఆయనకు వంత పాడుతూ వేణు వండర్స్ కూడా తనకు లైఫ్ ఇచ్చిన షోపైనే సెటైర్లు వేశాడు. ఇదంతా చూస్తూ నాగబాబు నవ్వుతూ ఉండటం సోషల్ మీడియాలో జబర్దస్త్ అభిమానులకు కోపం తెప్పిస్తుంది.

ఇన్నాళ్లు అక్కడే ఉండి అక్కడ లైఫ్ అందుకొని ఇప్పుడు వేరే ఛానల్ కు వచ్చి లైఫ్ ఇచ్చిన షోపైనే సెటైర్లు వేయడం ఏమైనా బాగుందా అంటూ మెగా బ్రదర్ నాగబాబును ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. తాజాగా విడుదలైన ప్రోమోలో జబర్దస్త్ మీద అదిరిపోయే పంచులు వేసాడు కిరాక్ rp. కొత్త ఇంటికి వచ్చాను కదా ఇక్కడ అన్ని అద్భుతంగా ఉంటాయి అంటూ జబర్దస్త్ కామెడీ షోను తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. ఇక వేణు వండర్స్ కూడా ఇలాంటి కామెంట్స్ చేసి ఇపుడు విమర్శల పాలవుతున్నారు. బాబు గారు మీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు అని చెప్పాను కదా.. వస్తూ వస్తూ మీతో ముగ్గురిని తీసుకొస్తారని కూడా చెప్పాను.. అంటూ వేణు డైలాగ్స్ చెప్పడం నాగబాబు పగలబడి నవ్వడం అన్ని ప్రోమోలో కనిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా వేరే ఛానల్ కు వచ్చినా.. ముందు చేసిన ప్రోగ్రామ్ పై ఇలా పంచులు వేయడం మాత్రం ఏమాత్రం బాగోలేదు అంటున్నారు నెటిజన్లు.

More Related Stories