English   

మణిశర్మ ఈజ్ బ్యాక్.. వరస సినిమాలతో కుమ్మేస్తున్న మెలోడీ బ్రహ్మ..

 Mani Sharma
2019-11-23 12:17:11

మెలోడి బ్ర‌హ్మ‌.. తెలుగులో ఈ పేరు ఒక్క మ‌ణిశ‌ర్మ‌కు త‌ప్ప మ‌రే సంగీత ద‌ర్శ‌కుడికి స‌రిపోదు. ఆయ‌న మాత్ర‌మే దీనికి అర్హుడు. ఇప్పుడు కాదు.. ఎప్ప‌టికైనా మ‌ణిశ‌ర్మ పాట‌లంటే ఆల్ టైమ్ ఫేవ‌రేట్ అంతే. కాక‌పోతే ఇండ‌స్ట్రీలో ఎవ‌రికైనా ఓ టైమ్ వ‌ర‌కే అన్నీ న‌డుస్తాయి. మ‌ణిశ‌ర్మ టైమ్ ఇప్పుడు లేదు. అందుకే కుర్రాళ్ల‌కు వ‌దిలేసి తను హాయిగా కొన్ని సినిమాల‌కు ఆర్ఆర్ ఇస్తున్నాడు.

 ఒక‌ప్పుడు ఈయ‌న ప‌నిచేయ‌ని హీరో లేడు.. ద‌ర్శ‌కుడు లేడు. అప్ప‌ట్లో ఏ సినిమా చూసినా ఈయ‌న పేరు క‌న‌బ‌డాల్సిందే. ప‌దేళ్ల కాలంలోనే 110కి పైగా సినిమాలకు సంగీతం అందించాడు మ‌ణిశ‌ర్మ‌. ఈ మ‌ధ్య దేవీ, థ‌మ‌న్ కు తోడు కుర్ర సంగీత ద‌ర్శ‌కుల తాకిడి.. స్టార్ హీరోలు వీళ్ళ‌కు ప‌డిపోవ‌డంతో మ‌ణిశ‌ర్మ కాస్త సైలెంట్ అయిపోయాడు. ఆ మధ్య నితిన్ లై సినిమాతో పాటు మ‌రిన్ని సినిమాల‌కు ప‌ని చేసాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. 2018లో కూడా వ‌ర‌స‌గా సినిమాలు చేసాడు మ‌ణిశ‌ర్మ‌. ఎమ్మెల్యే సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలకు సంగీతం అందించాడు. 

ఇక ఈ ఏడాది విడుద‌లైన ఇస్మార్ట్ శంకర్ పాటలు మణిశర్మ లోని అసలైన మాస్ సంగీత దర్శకుడిని మళ్లీ బయటికి తీసుకొచ్చాయి. ఇక గ‌త రెండేళ్లుగా జెంటిల్ మ‌న్.. లై.. ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు మణి. ఈ మ‌ధ్యే ఈయ‌న చేతుల్లోకి భారీ ప్రాజెక్ట్ ఒక‌టి వ‌చ్చింది. అదే చిరంజీవి కొరటాల సినిమా. ఒకవేళ నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం మణిశర్మకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే.  పైగా గతంలో చిరంజీవికి చాలా మ్యూజికల్ హిట్లు ఇచ్చాడు మణిశర్మ. అదే నమ్మకంతో ఇప్పుడు మరో అవకాశం ఇవ్వబోతున్నాడు మెగాస్టార్. చూడాలిక‌.. ఈ ఏడాదైనా మ‌ళ్లీ మ‌ణిశ‌ర్మ ఈజ్ బ్యాక్ అనిపిస్తాడో లేదో..?

More Related Stories